లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-12-15T23:49:16+05:30 IST

లైఫ్ సైన్సెస్ రంగంలో దేశానికే రాజధానిగా హైదరాబాద్

లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్‌

సంగారెడ్డి: లైఫ్ సైన్సెస్ రంగంలో దేశానికే రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని సుల్తాన్ పూర్ మెడికల్ డివైస్ పార్క్‌లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఈ పార్క్‌లో 7 కంపెనీలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. 50కి పైగా సంస్థలకు మెడికల్ పార్క్‌లో స్థలాలు కేటాయించామన్నారు. ఇప్పటికే 7 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయని ఆయన తెలిపారు. నాలుగు ఏళ్లలో మెడికల్ డివైస్ పార్క్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమల రావడం సంతోషంగా ఉందన్నారు.


రూ. 1,424 కోట్ల పెట్టుబడులను 50 కంపెనీలు పెట్టాయన్నారు. 7000 మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన లక్ష్యంగా మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో మెడికల్ డివైస్‌లను 78 శాతం ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు జీవ ఔషధ రంగంలో తెలంగాణను హబ్ చేయాలని కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ సంస్థ మెడికల్ డివైస్ పార్క్‌లో నిర్మాణంలో ఉందన్నారు. 

Updated Date - 2021-12-15T23:49:16+05:30 IST