మైనారిటీల సంక్షేమానికి కేసీఆర్‌ కృషి:కొప్పుల

ABN , First Publish Date - 2021-02-06T09:21:28+05:30 IST

మైనారిటీల సంక్షేమానికి కేసీఆర్‌ కృషి:కొప్పుల

మైనారిటీల సంక్షేమానికి కేసీఆర్‌ కృషి:కొప్పుల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మైనారిటీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా బడ్జెట్‌లో రూ.1,518 కోట్లను కేటాయించారన్నారు. మైనారిటీల సంక్షేమానికి సంబంధించి హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి సమీక్షించారు. మైనారిటీల కోసం 204 గురుకులాల ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీలకు సంబంఽధించి దామోదరం సంజీవయ్య భవన్‌లో మంత్రి సమీక్షించారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రతి మండలంలో ఒక స్టడీ  సెంటర్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని కొప్పుల తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను అందిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. వీటి దరఖాస్తు గడువును 15 వరకు పొడిగించామని చెప్పారు.

Updated Date - 2021-02-06T09:21:28+05:30 IST