సెంటర్‌ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ను సందర్శించిన కొప్పుల

ABN , First Publish Date - 2021-01-14T01:34:37+05:30 IST

నగరంలోని రహమత్‌నగర్‌లోని సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ను మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌,

సెంటర్‌ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ను సందర్శించిన కొప్పుల

హైదరాబాద్‌: నగరంలోని రహమత్‌నగర్‌లోని సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ను మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌లు బాల్కసుమన్‌, గువ్వల బాలరాజుతో కలిసి బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భగా సీఎం కేసీఆర్‌ ఈ సెంటర్‌కు శంకుస్ధాపన చేశారని అన్నారు.రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈసెంటర్‌  ఈసంవత్సరం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రారంభానికి సిద్ధమవుతోందని తెలిపారు.


 సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే వారికి ఈ సెంటర్‌లో అన్నిసౌకర్యాలు ఉంటాయన్నారు. దళితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. ఈసందర్భంగా విప్‌బాల్కసుమన్‌ మాట్లాడుతూ దళిత వర్గాలకు సంబంధించి హైదరాబాద్‌ మహా నగరంలో ఇలాంటి సెంటర్‌ను ఏర్పాటుచేయడం అద్భుతమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కాలెయాదయ్య, మాగంటి గోపీనాధ్‌, డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T01:34:37+05:30 IST