జోగులాంబా అమ్మ‌వారి బ్రహ్మోత్సవాలు:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ కు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-02-08T19:46:59+05:30 IST

అలంపూర్ శ్రీ జోగులాంబా అమ్మ‌వారి బ్రహ్మోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి అలంపూర్ ఎమ్మెల్యే డా. అబ్ర‌హం, ఆల‌య చైర్మ‌న్ ర‌విప్ర‌కాష్ గౌడ్, ధ‌ర్మ‌క‌ర్త‌

జోగులాంబా అమ్మ‌వారి బ్రహ్మోత్సవాలు:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ కు ఆహ్వానం

హైద‌రాబాద్: అలంపూర్ శ్రీ జోగులాంబా అమ్మ‌వారి బ్రహ్మోత్సవాలకు రావాలని  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి అలంపూర్ ఎమ్మెల్యే డా. అబ్ర‌హం, ఆల‌య చైర్మ‌న్ ర‌విప్ర‌కాష్ గౌడ్, ధ‌ర్మ‌క‌ర్త‌ న‌ర్సింహారెడ్డి, దేవాస్థాన అర్చ‌కులు అర‌ణ్య భ‌వ‌న్ లో ఆహ్వాన పత్రికను అందజేసి,  బ్రహ్మోత్సవాలకు రావలసిందిగా కోరారు. అనంతరం మంత్రికి అమ్మ‌వారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందించి సత్కరించారు.  ఈ నెల 12  నుంచి 16 వరకు శ్రీ జోగులాంబా అమ్మ‌వారి  బ్రహ్మోత్సవాలు వైభవం గా జరుగనున్నాయి.

Updated Date - 2021-02-08T19:46:59+05:30 IST