మేడారంలో త్వరలో వసతి కేంద్రాలు
ABN , First Publish Date - 2021-12-31T01:48:13+05:30 IST
తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు

హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా అక్కడ బస చేసేందుకు హోటళ్లు, సత్రాల వంటివి లేక పోవడం, ఇష్టమైన ఫుడ్ తినేందుకు మంచి క్యాంటీన్ సదుపాయం కూడా లేదు. ఈ నేపధ్యంలో మరికొద్ది నెలల్లోనే మేడారం సమక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఉండానికి వసతి సౌకర్యం, మంచి రుచికరమైనఫుడ్ అందించే కేంటీన్లు ఏర్పాటు కానున్నాయి.
ఈమేరకు గురువారం జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతరకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించే విషయంపై సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో రూ. 10 కోట్లతో సూట్ రూమ్స్, డార్మిటరి,క్యాంటీన్, ఇతర సౌకర్యాలతో వసతి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.