30వ తేదీన పోడు భూములపై భేటీ కానున్న అఖిల పక్షం
ABN , First Publish Date - 2021-10-29T21:00:00+05:30 IST
పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీయం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 30వ తేదీ శనివారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.

నిర్మల్: పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీయం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 30వ తేదీ శనివారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి అఖిల పక్ష నేతలతో పాటు అటవీ, గిరిజన, రెవెన్యూ శాఖల అధికారులు హజరుకానున్నారు.ఇప్పటివరకు పోడు భూములను సాగు చేసుకుంటున్నగిరిజనులు తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పిండంతో పాటు, అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.