ఉద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-22T21:30:34+05:30 IST

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఫిట్ మెంట్, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంచి ఉద్యోగుల పక్షపాతిగా సీయం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

ఉద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైద‌రాబాద్: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఫిట్ మెంట్, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంచి ఉద్యోగుల పక్షపాతిగా సీయం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ న్యాయ‌,  దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించడం  ప‌ట్ల ఆయ‌న‌ హ‌ర్షం వ్యక్తం చేశారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ ప్రకటించారని మంత్రి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 


తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండి అనేక సమస్యలను పరిష్కరించించిన సీయం కేసీఆర్ ఇప్పుడు కూడా తాను  ఇచ్చిన హామీలను నెరవేర్చార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచి ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ శ్రేయస్సుకు కట్టుబడిన ప్రభుత్వమని మరోసారి నిరూపించార‌న్నారు.  ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా  వేతనాలను పెంచి సీఎం ప్రకటించి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నార‌ని చెప్పారు.  


కాగా వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజ‌యం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి  అసెంబ్లీలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా మంత్రి ఇంద్ర‌కర‌ణ్ రెడ్డిని క‌లిసారు. ఈ సంద‌ర్భంగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని మంత్రి అభినందించారు.  ‌

Updated Date - 2021-03-22T21:30:34+05:30 IST