రద్దైన చట్టాలను మళ్ళీ తెస్తామనడం విడ్డూరం: హరీశ్ రావు
ABN , First Publish Date - 2021-12-27T00:29:29+05:30 IST
రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు మళ్ళీ తెస్తా అనడం విడ్డురంగా ఉందని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే..

సిద్దిపేట: రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు మళ్ళీ తెస్తా అనడం విడ్డూరంగా ఉందని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే రైతు చట్టాలు ఉపసంహరించుకున్నారని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ కృషి, మల్లన్న దేవుని అనుగ్రహంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. గత ఏడేళ్లుగా ఆలయంలో రూ.33 కోట్లతో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారని హరీశ్‌రావు తెలిపారు.