జిల్లా కలెక్టరేట్ లో మంత్రి హరీశ్ రావు సమావేశం

ABN , First Publish Date - 2021-05-08T21:24:46+05:30 IST

జిల్లా కలెక్టరేట్ లో పలు శాఖల అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టరేట్ లో మంత్రి హరీశ్ రావు సమావేశం

మెదక్: జిల్లా కలెక్టరేట్ లో పలు శాఖల అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మెదక్ మార్కెట్ కమిటీ ఆవరణలో దుకాణాల సముదాయం నిర్మాణంతో పాటు కరోనా నేపథ్యంలో బీహార్ కూలీలు వెళ్లిపోవడంతో హమాలీల సమస్య ఏర్పడింది అధికారులు తెలిపారు. ప్రైవేటు ట్రాక్టర్లతోనూ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేయాలని అధికారులకు  ఆదేశాలిచ్చినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకూ  జిల్లాలో లక్ష మందికి వ్యాక్సిన్ వేశారు.


నేటి నుండి సెకండ్ డోస్ వేసే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. అలాగే జిల్లాలో లక్షా 40 వేల కుటుంబలను ఇంటింటి సర్వే చేయగా 6 వేల మందికి కరానా లక్షణాలు ఉన్నట్లు తేలిందని చెప్పారు. ప్రజలు సహకరిస్తే కరోనా కట్టడి సాధ్యమవుతుందని అన్నారు.జిల్లాలో 240 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయిప్రైవేట్ ఆస్పత్రిలో 600 బెడ్స్ కు అనుమతి ఇచ్చామని చెప్పారు. అలాగే రెమ్ డేసివిర్ ఇంజక్షన్లు అవసరమైన మేర  జిల్లాలో నిల్వలున్నాయని మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-05-08T21:24:46+05:30 IST