బియ్యం సేకరణ సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-09-03T08:44:00+05:30 IST

తెలంగాణ నుంచి బియ్యం సేకరణలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్షు పాండేను మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు.

బియ్యం సేకరణ సమస్యలు పరిష్కరించండి

  • కేంద్ర పౌరసరఫరాల కార్యదర్శికి గంగుల వినతి


హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి బియ్యం సేకరణలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్షు పాండేను మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఢిల్లీలోని కృషి భవన్‌లో గురువారం ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా 2020- 21 యాసంగి సీజన్‌కు సంబంఽధించిన పారాబాయిల్డ్‌ రైస్‌ వాటాను పెంచాలని కోరారు. మొత్తం 50 లక్షల టన్నులు ఎఫ్‌సీఐ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఈ మేరకు ఎఫ్‌ఐసీ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని సుదాన్షు పాండే హామీ ఇచ్చారని గంగుల కమలాకర్‌ తెలిపారు.


Updated Date - 2021-09-03T08:44:00+05:30 IST