ధాన్యం సేకరణ సమస్యలపై ఢిల్లిలో బిజిబిజిగా మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-09-04T00:27:42+05:30 IST

దేశ రాజదానిలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పెండింగ్ సమస్యలపై బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రి తో భేటీలు జరుపుతున్నారు.

ధాన్యం సేకరణ సమస్యలపై ఢిల్లిలో బిజిబిజిగా మంత్రి గంగుల

హైదరాబాద్: దేశ రాజదానిలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పెండింగ్ సమస్యలపై బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రి తో భేటీలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతుల పక్షపాతిగా వారికి లబ్దీ చేకూర్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోడని సూచించారు. పౌరసరఫరాల శాఖకు సంబందించి కేంద్రం, ఎఫ్.సి.ఐ వద్ద ఉన్న పెండింగ్ అంశాల పరిష్కారం కోసం మంత్రి గంగుల కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్రం తీసుకొనే భియ్యంలో 2020-21 యాసంగి సీజన్కు చెందిన బాయిల్డ్  రైస్ వాటా పెంపు, గత యాసంగి అందించాల్సిన లక్ష క్వింటాళ్ల బియ్యంపై 30 రోజులు అదనపు సీఎంఆర్ గడువు, వచ్చే వానాకాలంలో తెలంగాణలో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు, ఈ మూడు ప్రధాన అంశాలుగా మంత్రి కేటీఆర్ తో కలిసి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పియూష్ గోయల్ని సెప్టెంబర్ 1న కలిసారు మంత్రి గంగుల. కేంద్ర మంత్రి సానుకూల ఆదేశాలతో తిరిగి కేంద్ర ప్రజాపంపిణీ కార్యదర్శి సుదాన్షు పాండేను కలిశారు. 


వేగంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను వివరించారు, ఆ తర్వాత ఎఫ్.సి.ఐ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ సీఎండి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర సివిల్ సప్లైస్ అధికారులు బేటి అయ్యారు, దానికి కొనసాగింపుగా శుక్రవారం ఎఫ్.సి.ఐ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అతీష్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంగుల ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ వరుస బేటిలతో మంత్రి గంగుల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న న్యాయబద్దమైన అంశాలను కేంద్రానికి కూలంకషంగా వివరించారు. రైతు ఉత్సత్తులను సేకరించడంలో వ్యాపార కోణంలో మాత్రమే కాకుండా మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన అవసరముందని గుర్తుచేసారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ద్రుష్టితో తీసుకున్న రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాల అందుబాటు వంటి చర్యలు, రైతుల కోసం ఖర్చుచేసిన వేల కోట్ల రూపాయలు ఇప్పుడిప్పుడే సత్పలితాలిస్తున్నాయని, ఈ సమయంలో కేంద్రం మద్దతు తెలపాల్సిన అవసరాన్ని మంత్రి గంగుల గుర్తు చేశారు.


దేశంలో కరోనా సంక్షోభంతో కోట్లాది ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పేదలందరికీ ఆహార ధాన్యాలు అందించాల్సిన క్లిష్ట సమయంలో ఆహార వ్రుధాను అరికట్టడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యంగా ఉండాలన్నారు, యాసంగిలో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఆ పరిస్థితుల్లో పండిన ధాన్యాన్ని రారైస్ గా మిల్లింగ్ చేసినప్పుడు విరిగిపోయి లక్షల క్వింటాళ్ల బియ్యం పనికిరాకుండా పోతాయన్నారు. ఈ కరోనా క్లిష్ట సమయంలో అంత దాన్యాన్ని వ్రుధా చేయడం సరికాదని అందువల్ల బాయిల్డ్ రైస్ రూపంలోనే వాటిని తీసుకోవాలని కోరారు గంగుల. రికార్డు స్థాయిలో దాదాపు కోటి క్వింటాళ్ల ధాన్యం దిగుబడులు వచ్చాయని గణాంకాలతో సహా కేంద్రం ముందుంచారు, ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని మిల్లింగ్ చేయడమే సవాళ్లతో కూడుకున్నదని ఇప్పుడు వాటిని రా రైస్ రూపంలో ఇవ్వడమంటే రైతుల్ని పూర్తిగా నట్టేట్లో ముంచడమే ఆవుతుందని కేంద్రం వద్ద తన ఆవేదనని వ్యక్తం చేసారు మంత్రి గంగుల.కాబట్టి యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా అందించడానికి సహకరించాలని కోరారు.

Updated Date - 2021-09-04T00:27:42+05:30 IST