బిసి కమిషన్‌ ఛైర్మన్‌ను సన్మానించిన మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-10-07T20:58:59+05:30 IST

బిసి కమిషన్‌ ఛైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వకుళాభరణం కృష్ణమోహన్‌ రావును బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

బిసి కమిషన్‌ ఛైర్మన్‌ను సన్మానించిన మంత్రి గంగుల

హైదరాబాద్‌: బిసి కమిషన్‌ ఛైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వకుళాభరణం కృష్ణమోహన్‌ రావును బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గుంగుల శాలువాతో సన్మానించారు. తాను నిర్వహిస్తున్న బిసి సంక్షేమశాఖలో భాగంగా బిసి కమిషన్‌ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ నియమితులు కావడం అరుదైన గౌరవమని అన్నారు. రానున్నకాలంలో అందరం కలిసి పని చేస్తామని మంత్రి తెలిపారు.


సీఎం కేసీఆర్‌ కంటున్న కలలను సాకారం చేసే దిశగా బంగారు తెలంగాణ లక్ష్యంగా బిసిల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డాక్టర్‌ వకుళాభరణం ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, హుజూరాబాద్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ వడ్లూరి విజయ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కాశీపేట శ్రీనివాస్‌, గుండె శ్రీనివాస్‌ తదితరులుకూడా సన్మానించారు. 

Updated Date - 2021-10-07T20:58:59+05:30 IST