అన్నదాత వెన్నెముకను విరుస్తారా?

ABN , First Publish Date - 2021-10-29T05:36:28+05:30 IST

అన్నదాత వెన్నెముకను విరుస్తారా?

అన్నదాత వెన్నెముకను విరుస్తారా?
మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 ఎఫ్‌సీఐ ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయించండి

 రైతుల పేరుతో దొంగ దీక్ష చేస్తున్న బండి సంజయ్‌

 బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్‌

 గతంలో మాదిరిగానే ధాన్యం కొంటాం : పల్లా

ఓరుగల్లు, అక్టోబర్‌ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లచట్టాలతో రైతాంగాన్ని నాశ నం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని రాష్ట్ర పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. హనుమకొండలోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఆయన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో క లిసి విలేకరులతో మాట్లాడారు. రైతుల పేరుతో దొంగ దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ కు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఎఫ్‌సీఐ ద్వారా వరి ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం నుంచి లెటర్‌ తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ పని చేస్తే బండి సంజయ్‌కు దండం పెడతా.. రెండు కాళ్లు మొక్కుతా.. ఎర్రబెల్లి అన్నారు. ఆరు నెలలుగా రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే పట్టించుకోకుం డా ఉన్న బీజేపీ.. రైతులకు మేలు చేసేందుకు దీక్షలు చేస్తోందా.. అని మండిపడ్డా రు. పిచ్చిమాటలు, అబద్దపు ప్రచారంతో తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకోసం ఏమి చేసిందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.  

గిరిజన విశ్వవిద్యాలయం, కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమలాంటి విభజన హామీలను కూడా కేంద్రం తుంగలో తొక్కిందన్నారు.  7మెడికల్‌ కాలేజీలు రాష్ట్రానికి కావాలని కోరితే.. కనీసం కరీంనగర్‌కు కూడా తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్‌ అని ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీటి వసతి ఉన్న దగ్గర రైతు లు వరి పండించడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, నీటి వసతిలేని ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతున్నామన్నారు. ముఖ్యమం త్రి కేసీఆర్‌ ఒక రైతు బిడ్డగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నాడన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతాంగం కోసం నిరంతరం ఉచిత విద్యుత్‌ సరఫరా, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. నిరంతరం వంట గ్యాస్‌,  పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచుతున్నారన్నారు.

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం.. 

నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని సర్వనాశనం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వమని, ఆం దోళన చేస్తున్న రైతులను హత్య చేస్తున్నదీ బీజేపీ ప్రభుత్వమని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు.  ఇవన్నీ ప్రజలకు తెలియవ నుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అబద్దాలు ప్రచారం చేస్తూ దొంగ దీక్ష చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవసాయం బాగుపడిందంటే ఒక్క కేసీఆర్‌ ప్రభుత్వంలో నేనన్నారు. కోటి ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. 

కేంద్రం వరి ధాన్యాన్ని కోనుగోలు చేయమని చేతులు ఎత్తేస్తే ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ పలు దఫాలు చేసిన విజ్ఞప్తికి స్పందించి కేవలం కొద్దిమేరకు మాత్రమే కొనుగో లు చేశారని రాజేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. గత సెప్టెంబర్‌లో ఎఫ్‌సీఐ పరిమితంగా వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసినందున రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబందించి కొన్ని సూచనలు మాత్రమే అధికారులు చేశారన్నా రు. గతంలో మాదిరిగానే రైతులు పండించిన ప్రతి వడ్లగింజను కొనుగోలు చేస్తా మని పల్లా స్పష్టం చేశారు. ఇప్పటికే 7,256 కేంద్రాలను ఏర్పాటు చేసి వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-10-29T05:36:28+05:30 IST