బీజేపీ వాళ్లను కొట్టే రోజులు వస్తాయి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-11-11T23:43:32+05:30 IST

బీజేపీ వాళ్లను ఉరికించి కొట్టే రోజులు వస్తాయని మంత్రి

బీజేపీ వాళ్లను కొట్టే రోజులు వస్తాయి: మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ: బీజేపీ వాళ్లను ఉరికించి కొట్టే రోజులు వస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. నగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా సాయం చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విభజన చట్ట హామీలను కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలోని రైస్ కొంటారో, కొనరో సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోవాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.


ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ రైతు బిల్లులను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడంతోనే తమపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. బీజేపీ వాళ్లను ఉరికించి కొట్టే రోజులు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో శుక్రవారం నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని రైతులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-11-11T23:43:32+05:30 IST