మానకొండూరు రోడ్డు ప్రమాదం పై మంత్రి ఎర్రబెల్లి దిగ్ర్ర్భాంతి

ABN , First Publish Date - 2021-11-26T22:33:26+05:30 IST

కరీంనగర్ జిల్లా మానకొండూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రావు మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

మానకొండూరు రోడ్డు ప్రమాదం పై మంత్రి ఎర్రబెల్లి దిగ్ర్ర్భాంతి

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రావు మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అకాల మరణం అత్యంత బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.


Updated Date - 2021-11-26T22:33:26+05:30 IST