ఎన్నిక ఏదైనా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-12-16T00:31:53+05:30 IST

ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసిన నేపథ్యంలో, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లో పాలకుర్తి నియోజకవర్గ జెడ్పీటీసీ లు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల తో ఈ రోజు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి

ఎన్నిక ఏదైనా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు: ఎర్రబెల్లి

యాదాద్రి: ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసిన నేపథ్యంలో, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లో పాలకుర్తి నియోజకవర్గ జెడ్పీటీసీ లు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల తో ఈ రోజు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో జెడ్పీ టీసీ లు, ఎంపీటీసీ లు, కౌన్సిలర్లు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. తరువాత స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. 


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఎన్నిక ఏదైనా ప్రజలు టిఆర్ఎస్ పక్షానే ఉన్నారన్నారు. ప్రతి ఎన్నికలోను పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నాయకులు కష్టపడి పనిచేస్తున్నారని అభినందించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు మన ఐక్యతను చాటాయని, అందుకే ప్రతిపక్షాలు కనీసం అభ్యర్థిని నిలపడానికి కూడా సాహసించలేదు అన్నారు. అందుకే ఎదురు లేకుండా ఏకగ్రీవం సాధ్యమైందని, ఈ ఘనత గౌరవ జెడ్పీటీసీ లు, ఎంపీటీసీ లు, కౌన్సిలర్ల దే నని మంత్రి చెప్పారు. జరిగిన ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ అభ్యర్థులు బంపర్ మెజారిటీ సాధించారని అభినందించారు. భవిష్యత్తులోనూ ఈ ఐక్యతను కొనసాగించాలని మంత్రి అన్నారు. తన ఏకగ్రీవ ఎన్నికకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-12-16T00:31:53+05:30 IST