న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో టిఆర్ఎస్ పార్టీ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌

ABN , First Publish Date - 2021-10-29T20:21:37+05:30 IST

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, సాధించిన విజయాలను తెలిపేందుకు నవంబరు 15న వరంగల్ లో టీఆర్ఎస్ విజయగర్జన సభ నిర్వహిస్తున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు

న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో టిఆర్ఎస్ పార్టీ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌

వరంగల్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, సాధించిన విజయాలను తెలిపేందుకు నవంబరు 15న వరంగల్ లో టీఆర్ఎస్ విజయగర్జన సభ నిర్వహిస్తున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.10ల‌క్ష‌ల మందితో స‌భ విజ‌య‌వంతానికి స‌న్నాహాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.వరంగల్ న‌గ‌ర స‌మీపంలో సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించి, విజ‌య‌వంతం చేసేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెపా్పరు.. ఆయన వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యే ఆదూరి రమేష్ తదితరులు ఉన్నారు. 


న‌గ‌రంలోని మడికొండ, ఉనికిచర్ల శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప‌రిశీలించారు. టిఆర్ఎస్ పార్టీ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను 10 ల‌క్ష‌ల మందితో భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ఎలాంటి అటంకాలు క‌లుగ‌కుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన‌ స్థలాన్ని ప‌రిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇరవై ఏళ్లలో పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్య‌మంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు.

Updated Date - 2021-10-29T20:21:37+05:30 IST