పీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-06-28T19:52:57+05:30 IST

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురించి ఎంత చెప్పినా తక్కువేనని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే: ఎర్రబెల్లి

వరంగల్: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురించి ఎంత చెప్పినా తక్కువేనని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా ఆయన హన్మకొండ జెఎన్ఎస్ స్టేడియం లోని పి.వి. నర్సింహా రావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా , ప్రధానిగా ఎదిగిన పీవీ ఎంతో నిజాయితీగా పనిచేశారని అన్నారు. స్వంత వారికి సైతం అప్పనంగా పనిచేయలేదని చెప్పారు. స్వలాభం లేని నిజాయితీ పరుడు పీవీ అని ఆయన కొనియాడారు. ఆయన రాజకీయ ఎదుగుదల తెలంగాణ నుంచే ప్రారంభం కావడం మనకు గర్వకారణమని అన్నారు. 


బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పీవీని పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం  కేసీఆర్ మాత్రం పీవీకి సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు. పీవీ శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని అన్నారు. భూ సంస్కరణలుచేసి పేదలకు భూములు అందేలా చేసిన మహనీయుడు పీవీ నర్సింహారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్, మేయర్ సుధారాణి, అర్భజిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, రూరల్ కలెక్టర్ హరిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-28T19:52:57+05:30 IST