వరంగల్ కు వరాలు ప్రకటించిన సీఎంకు థ్యాంక్స్: ఎర్ర‌బెల్లి

ABN , First Publish Date - 2021-06-21T23:42:27+05:30 IST

వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స‌మ‌గ్ర అభివృద్దికి, సంక్షేమానికి వ‌రాల‌ను ప్ర‌క‌టించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి పంచాయతీరాజ్‌శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

వరంగల్ కు వరాలు ప్రకటించిన సీఎంకు థ్యాంక్స్: ఎర్ర‌బెల్లి

వరంగల్: వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స‌మ‌గ్ర అభివృద్దికి, సంక్షేమానికి వ‌రాల‌ను ప్ర‌క‌టించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి పంచాయతీరాజ్‌శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌రంగ‌ల్ జిల్లాను విద్యా, వైద్య‌, ఐటి, వ్య‌వ‌సాయ‌, పారిశ్రామిక‌ రంగాల్లో మ‌రింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్య‌మంత్రి కి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జ‌ల ప‌క్షాన ఒక ప్రకటనలో ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. రెండు వంద‌ల‌ ఎకరాల‌కు పైగా ఉన్న ఎంజిఎం, కేయంసి, ప్రాంతీయ‌ కంటి ధ‌వాఖాన‌, సెంట్ర‌ల్ జైలు స్థ‌లంలో హెల్త్ హ‌బ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, వెంట‌నే కేన‌డాలో ప్ర‌భుత్వ ప్ర‌తినిధి బృందం ప‌ర్య‌టించాలని సీఎం ఆదేశించారు. అంత‌క‌న్నా మెరుగైన వ‌స‌తుల‌తో సెంట్ర‌ల్ జైలు స్థ‌లంలో ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో 33 అంత‌స్థులతో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణాన్నిచేపట్టడం వల్ల ఇక్కడి ప్రజలకు ఎంతో మేలుకలుగుతుందన్నారు. ఏడాదిన్న‌రలో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల‌ని ఆదేశించ‌డం వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు శుభ ప‌రిణామ‌మ‌ని ఎర్ర‌బెల్లి అన్నారు.


ప్ర‌జాభిప్రాయం మేర‌కు వ‌రంగ‌ల్ అర్భ‌న్‌, వ‌రంగ‌ల్ రూర‌ల్‌ జిల్లాల‌కు హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ గా నామ‌క‌ర‌ణం చేయాల‌ని నిర్ణ‌యించడంతో పాటు, వ‌రంగ‌ల్ న‌గరంలో ప్ర‌భుత్వ దంత వైద్య‌శాల‌, డెంటల్ కళాశాల‌, వెట‌ర్న‌రీ క‌ళాశాల‌ను మంజూరు చేయ‌డం, మామునూరు విమానాశ్ర‌యం త్వ‌ర‌లోనే రాబోతుంద‌ని ప్ర‌క‌టించడంతో వ‌రంగ‌ల్ జిల్లా మ‌రింత అభివృద్ది చెందుతుంద‌ని ఎర్ర‌బెల్లి అన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌ను ద్వారా గోదావ‌రి జ‌లాల‌ను పూర్తిగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని క‌రువు ప్రాంతాల‌ను స‌స్య‌శామ‌లం చేసేందుకు అవ‌స‌ర‌మైన ఎన్ని నిధుల‌నైన కేటాయించాల‌ని ఆదేశించిన సియం కేసిఆర్ కి  ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రైతుల ప‌క్షాన కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Updated Date - 2021-06-21T23:42:27+05:30 IST