రాబోయే మూడు ఏండ్ల లో ఎన్నికల హామీలను పూర్తి చేస్తాం:ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-03-04T20:01:14+05:30 IST

ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టిన ఎనబై శాతం హామీలను నెరవేర్చాం, మిగతావి రాబోయే మూడు ఏండ్ల లో పూర్తి చేస్తామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాబోయే మూడు ఏండ్ల లో ఎన్నికల  హామీలను పూర్తి చేస్తాం:ఎర్రబెల్లి

జనగామ: ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టిన ఎనబై శాతం హామీలను నెరవేర్చాం, మిగతావి రాబోయే మూడు ఏండ్ల లో పూర్తి చేస్తామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాటాడారు. ఇప్పటి వరకు లక్షా ముఫ్పై రెండు వేల 899 ఉద్యోగాలు ఇచ్చాం, మరో యాబై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ సిద్దం చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్, కేటిఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో ముందంజలో ఉన్నామని, బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు.


కేంద్రం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి రికార్డు స్థాయిలో ధరలు పెంచారు. నల్ల ధనం వెలికి తీసి వందరోజుల్లో ఒక్కొక్కరి కాథాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పావ్ ఎవరికైనా వేశావా?రైల్వేను కూడా  ప్రధాని మోడీ  ప్రయివేటు పరం చేస్తాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను  ప్రైవేటు పరం చేశాక రిజర్వేషన్ ఎలా అమలవుతుంది? అని సవాల్ విసిరారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. రాష్ట్రానికి కావాలని అడిగినా ఒక్క కాలేజీ నీ ఇవ్వలేదు. బండి సంజయ్ పిచ్చికూతలు కూస్తడు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను కేంద్రం మోసం చేస్తుంది.


రైతులు ధర్నా చేస్తే బిజేపి స్పందించడం లేదు. బిజేపి కన్నా దొంగలు నయం అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది, బిజేపి పార్టీ ఆరు సంవత్సరాల నుండి నాశనం చేస్తూ వస్తుంది. చైనాను లడాక్ నుంచి తరిమి కొడతాం అన్నరు ఏమైంది.?ఖమ్మం, నల్గొండ, వరంగల్   మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ లను కోరుతున్నా పల్లా రాజేశ్వర్ రెడ్డిని,  హైదరాబాదులో పివి నరసింహారావు కూతురు సురభి వాణీ దేవిని మంచి మెజారిటీతో గెలిపించాలి. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తిరగ బడాలని పిలుపుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.


Updated Date - 2021-03-04T20:01:14+05:30 IST