బీజేపీ, కాంగ్రెస్లకు మరోసారి ప్రజలు బుద్ధి చెప్పారు..‌

ABN , First Publish Date - 2021-03-22T05:07:22+05:30 IST

బీజేపీ, కాంగ్రెస్లకు మరోసారి ప్రజలు బుద్ధి చెప్పారు..‌

బీజేపీ, కాంగ్రెస్లకు మరోసారి ప్రజలు బుద్ధి చెప్పారు..‌
విలేకరుల సమావేశంంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హన్మకొండ టౌన్‌, మార్చి 21 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన ప్రజలు.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మరోసారి బుద్ధి చెప్పారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమని, ఇకనైనా కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పిచ్చి కూతలు మానుకోవాలని సలహా ఇచ్చారు. భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎ్‌సదే విజయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్రులకు ఇచ్చిన ప్రాధాన్యత కాంగ్రెస్‌, బీజేపీకి ప్రజలు ఇవ్వలేదన్నారు. కేంద్రం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తించి ఈ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పరోక్షంగా తీన్మార్‌ మల్లన్నకు సహకరించారని ఆ పార్టీల నేతలే అంటున్నారని, ఈ విషయంపై ఆ పార్టీల నేతలే స్పష్టం చేయాలన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, ప్రభుత్వం తప్పకుండా పీఆర్‌సీ ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్‌ఎ్‌సదేనన్నారు. ప్రజలకు టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌పై స్పష్టత ఉందని, అందుకే అన్ని ఎన్నికల్లో తమకు అండగా నిలుస్తున్నారన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రభుత్వంలో కేసీఆర్‌ ఎలాంటి స్థాయి కల్పించినా తామంతా కట్టుబడి ఉంటామని మంత్రి అన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, నేతలు జన్ను జకార్య, హరిరమాదేవి  పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-22T05:07:22+05:30 IST