అన్నదాతల సంక్షేమమే సర్కారు ధ్యేయం

ABN , First Publish Date - 2021-12-07T05:37:55+05:30 IST

అన్నదాతల సంక్షేమమే సర్కారు ధ్యేయం

అన్నదాతల సంక్షేమమే సర్కారు ధ్యేయం
రైతులతో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కేసీఆర్‌ కృషితోనే పండుగలా వ్యవసాయం

కేంద్ర చట్టాలతో  రైతుల భవిష్కత్‌ అంధకారం

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పెద్దవంగర, డిసెంబర్‌ 6: అన్నదాతల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్వేయమని, రైతు బిడ్డగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో నేడు వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని గంట్లకుంట, పోచంపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం రైతుల మాట్లాడి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. 365 రోజులు కాల్వలు పారేలా కేసీఆర్‌ సాగునీటి ప్రణాళికలు రూపొందించారని, సాగు నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులకు ఒరిగేదేమి లేదని, కార్పొరేట్‌ సంస్థలకు లాభం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. ఉపాధి పఽథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలతో దేశంలోని రైతుల భవిష్యత్‌ అధంకారం మారుతుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయ మోటర్లుకు కరెంటు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా ఒత్తిడిని తీసుకోస్తున్నట్లు  తెలిపారు. రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు విముఖత చూపడంతో రైతులు యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలన్నారు. వ్యవసాయంలో పంటల మార్పిడి సహజమేనని, రైతులు లాభదయక పంటలు వేయాలని సూచించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించామని, క్రయ విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. రైతులు 17 శాతం తేమ ఉండాలే ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకరావాలన్నారు. రైతులు పండించిన ధ్యానానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. కొనుగోలు కేంద్రాల నుంచి గన్నీ సంచులను పొలాలకు వద్దకు ఇస్తే ఆయా కేంద్రాన్ని రద్దు చేస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బందులు కలుగకుండా మౌలిక సౌకర్యలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రతీ సెంటర్‌కు టార్ఫాలిన్లను, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరయ్యే గన్నీ సంచుల వివరాలను ముందస్తుగానే జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోక్లెను అందించారని అన్నారు.  కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-07T05:37:55+05:30 IST