‘గిరిజన బంధు’ ఇస్తాం: అల్లోల

ABN , First Publish Date - 2021-10-21T09:29:05+05:30 IST

దళిత బంధు తరహాలోనే ఆదివాసీ గిరిజనులకు గిరిజన బంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని..

‘గిరిజన బంధు’ ఇస్తాం: అల్లోల

ఆసిఫాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): దళిత బంధు తరహాలోనే ఆదివాసీ గిరిజనులకు గిరిజన బంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. రెండు నెలల్లోపు పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతుందన్నారు. కుమరం భీం 81వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌ స్మృతి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మినీ దర్బార్‌లో మంత్రి మాట్లాడుతూ.. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించే విషయమై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అటవీ హక్కులకు సంబంధించి కొంతమంది అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారి మాటలు నమ్మవద్దని చెప్పారు. గిరిజనులతో పాటు ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకూ ఆర్వోఎ్‌ఫఆర్‌ కింద హక్కులు కల్పిస్తామన్నారు. పట్టాలు ఇవ్వడం ద్వారా వారికి రైతుబంధు వర్తింపజేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. దీంతో ఆసిఫాబాద్‌ జిల్లాలో 33 వేలమంది గిరిజన, గిరిజనేతర రైతులు లబ్ధి పొందుతారని తెలిపారు.

Updated Date - 2021-10-21T09:29:05+05:30 IST