ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం : ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-07-25T05:20:08+05:30 IST
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం : ఎర్రబెల్లి

రాయపర్తి, జూలై 24: ఆకు పచ్చని రాష్ట్రాన్ని నిర్మించడమే లక్ష్యంగా సీఎం కేసీ ఆర్ పనిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. శనివారం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాయపర్తిలో ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటి, ఎర్రబెల్లి ట్రస్టు నుంచి కేటీఆర్ జన్మదినం కానుకగా దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపీ జోగినపెల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం లో అడవుల పెంపకం కోసం కేటీఆర్ జన్మదినం రోజు మంచి కార్యక్రమాన్ని చేప ట్టారన్నారు. హరితహారం పథకం ఎన్నో కోట్ల మొక్కలు నాటుతోందని, భావితరా లకు స్వచ్ఛమైన గాలిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం మైలా రంలో ఇటీవల మృతిచెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంది కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిత, డీఆర్డీవో పీడీ సంప త్రావు, ఆర్డీవో మహేందర్ జీ, ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో రాంమోహనాచారి, పీఏసీఎస్ చైర్మన్ కుం దూరు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.