ఆకేరు వాగుపై రోడ్డు, బ్రిడ్జికి గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-05-31T05:22:03+05:30 IST

ఆకేరు వాగుపై రోడ్డు, బ్రిడ్జికి గ్రీన్‌సిగ్నల్‌

ఆకేరు వాగుపై రోడ్డు, బ్రిడ్జికి గ్రీన్‌సిగ్నల్‌
కొత్తూరులో ప్రతిపాదిత స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి

పీఎంజీఎస్‌వై పథకం కింద రూ.10.43కోట్లు మంజూరు 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

రాయపర్తి, మే 30 : ఆకేరు వాగుపై రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని, దీంతో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు.  ఆదివారం కొత్తూరు గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని ఏఈలు సాత్మిక్‌, కిరణ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయపర్తి మండలం కొత్తూరు రోడ్డు నుంచి వర్ధన్నపేట మండలంలోని ల్యాబర్తి క్రాస్‌, వయా రోళ్లకల్‌, కల్లెడ వరకు ఆకేరు వాగు మీదుగా 5.23 కిలోమీటర్ల రోడ్డుతో పాటు ఆకేరు వాగు మీదుగా బ్రిడ్జి నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. పీఎంజీఎస్‌వై పథకం కింద రూ.10.43కోట్ల నిధులు మంజూరయ్యాయని వివరించారు. రోడ్డు నిర్మాణానికి రూ. 4.47 కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి రూ. 5.96 కోట్ల అంచనాలతో టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని రెవెన్యూ శివారులు ఆకేరు వాగు అవతల ఉండడంతో పర్వతగిరి మండలం మీదుగా వెళ్లాల్సి వచ్చేదన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే మూడు మండలాల అనుసంధానంతో ప్రజలందరికీ ఎటు వెళ్లిన  10 నిమిషాల్లో వెళ్లేలా సౌలభ్యం ఉండబోతోందని స్పష్టం చేశారు. 1234 12341 234 1234

90 కరోనా కేసులు... ఇద్దరి మృతి

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, మే 30: జిల్లాలో ఆదివారం కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో 498 మందికి కరోనా టెస్టులు నిర్వహిం చగా 90మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. 437 మందికి వ్యాక్సిన్‌ వే శారు. కరోనాతో ఇద్దరు మృతి చెందా రు. కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరులో 16, నడి కూడలో 15, దామెరలో 11, కేశవాపూ ర్‌లో 10, అలంకానిపేటలో తొమ్మిది, చెన్నారావుపేటలో ఏడు, సంగెంలో ఏడు, నర్సంపేటలో ఐదు, మేడపల్లిలో ఐదు, గీసుగొండలో రెండు, ఖానాపూర్‌లో రెండు, నల్లబెల్లిలో ఒక కేసు నమోదు కాగా నల్లబెల్లిలో ఒకరు, దామెరలో ఒకరు కరోనాతో మృతి చెందారు. 


Updated Date - 2021-05-31T05:22:03+05:30 IST