బీజేపీకి ఆ పార్టీ వాళ్ల భార్యలే ఓటేయరు..
ABN , First Publish Date - 2021-02-27T04:21:31+05:30 IST
బీజేపీకి ఆ పార్టీ వాళ్ల భార్యలే ఓటేయరు..

‘పల్లా’ను భారీ మెజారిటీతో గెలిపించాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పరకాల, ఫిబ్రవరి 26 : బీజేపోళ్లకు వాళ్ల భార్యలే ఓటు వేయరని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని డీపీఆర్ గార్డెన్‌లో శుక్రవారం ఎమ్మెల్యే ధర్మారెడ్డి అధ్యక్షతన పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తూ, గల్లా ఎగరేసుకొని టీఆర్‌ఎస్ కార్యకర్తలని చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వ సంస్థల్ని కేంద్ర ఒక్కొక్కటిగా అమ్మేస్తోందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో కూడా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.5లక్షల సబ్సిడీ రుణం, ఇల్లు కట్టి ఇచ్చేందు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారన్నారు. కాళేశ్వరం నీటితో రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికి నీటిని అందిస్తూ ఉచిత కరెంట్‌ను ఇస్తున్నామన్నారు. అబద్ధాలు చేప్పే ‘తీన్మార్ మల్లన్న’ను పర్వతగిరిలో ప్రజలు తరిమికొట్టారన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతీ ఒక్కటి అమలు చేసే మొనగాడు కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం నీటితో 50లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో రెండో పంట సాగుచేశారన్నారు. 8లక్షల మందికి కల్యాణలక్ష్మి, 60 లక్షల మంది రైతులకు రూ.17వేల కోట్లు, 43లక్షల మందికి పెన్షన్లు, వ్యవసాయ రంగంలో 2600, గురుకుల టీచర్ 10,500, పోలీస్ శాఖలో 32వేలు, సింగరేణిలో 13,500, ఆర్టీసీలో 5,500 పోస్టులను భర్తీ చేయడం జరిగిందని, అర్టీసీకి 200 కోట్లు ఇచ్చి నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గొర్లకాపర్ల మాజీ చైర్మన్ కన్నెబొయిన రాజయ్య, పరిశీలకులు బాలమల్లు, పరంజ్యోతి, రెడ్‌క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, నేతాని శ్రీనివాసరెడ్డి, సదానందం, సోదా రామకృష్ణ, బోచ్చు వినయ్, ప్రకాశ్‌రావు, బొజ్జం రమేష్ తదితరులు ఉన్నారు.
గీసుగొండ: త్వరలోనే నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా కొనాయిమాకు ల పీడీఆర్ గార్డెన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ కోసం కష్టపడే యువతకు ప్రైవేటు కంపెనీల్లో 2వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని హా మీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 5లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అందిస్తామన్నారు. గ్లోబల్ ప్రచారం చేస్తూ పిచ్చి డ్రామాలు ఆడుతున్న బీజేపీని టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిలదీయాలన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. నల్లధనం వెలికి తీసి ఒక్కొకరి అక్కౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన ఆయన ఎంతమంది అక్కౌంట్‌లో వేశారని ప్ర శ్నించారు. మెడికల్ కాలేజీల మంజూరులో కూడా తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందన్నారు.
గిరిజన యూనివర్సిటీ కోసం 600 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఇంతవరకు ఎందుకు మంజూరు చేయించలేదని ప్రశ్నించారు. కోచ్ ప్యాక్టరీ కోసం రూ.వెయ్యి కోట్ల స్థల ప్రాపర్టీని కేంద్రానికి అప్పగించినా, కోచ్ ప్యాక్టరీని మాత్రం ఉత్తరప్రదేశ్‌కు తరలించిందని ఆరోపించారు. తెలంగాణ ద్వారా కేంద్రానికి వివిధ పన్నుల ద్వా రా ఆరేళ్లలో రూ.2.72 లక్షల వేల కోట్లు చెల్లిస్తే, రాష్ట్రాని కి కేంద్రం ఇచ్చింది రూ.1.5 లక్షల వేల కోట్లని అన్నారు.
ఎంపీ దయాకర్ మాట్లాడుతూ ఉద్యమ లక్ష్యాలు నీళ్లు, నిధులు, నియామకాలు సీఎం కేసీఆర్ నెరవేస్తున్నారని వివరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీది ఫ్యాక్టరీల మూసే చరిత్ర అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే తెరిచే చరిత్రన్నారు. రాష్ట్రప్రభుత్వం 1.32 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటమే కాకుండా 14,800 ప్రైవేటు కంపెనీలను ఏర్పాటు చేయించి 2.3 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలను కల్పించిందన్నారు. వీఆర్‌ఏలను కూడా పర్మినెంట్ చేస్తామని వివరించారు. టీఎ్‌సఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, జడ్పీటీసీలు గూడ సుదర్శన్‌రెడ్డి, సంజీవరెడ్డి నాయకులు పుండ్రు జయపాల్‌రెడ్డి, సుంకరి శివ, బాలయ్య, పరంజ్యోతి, నేతాని శ్రీనివా్‌సరెడ్డి, నవీన్‌రాజ్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.