లక్షన్నర కుటుంబాలు రుణపడి ఉంటాయి

ABN , First Publish Date - 2021-03-24T07:40:06+05:30 IST

కుటుంబ పెన్షన్‌ నిర్ణయంతో లక్షన్నర కుటుంబాలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాయని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.

లక్షన్నర కుటుంబాలు రుణపడి ఉంటాయి

  • మంత్రి కేటీఆర్‌తో సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం
  • మంత్రి హరీశ్‌కు టీఎన్జీవోల సంఘం కృతజ్ఞతలు
  • సీఎం పేరు చరిత్రలో నిలిచిపోతుంది: డిప్యూటీ కలెక్టర్లు

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కుటుంబ పెన్షన్‌ నిర్ణయంతో లక్షన్నర కుటుంబాలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాయని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్‌ శ్రీకాంత్‌ నేతృత్వంలోని ప్రతినిధులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఉద్యోగులు, సీపీఎస్‌ ఉద్యోగులకు తీపి కబురు అందించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకున్న మంత్రి హరీశ్‌రావుకు టీఎన్జీవోల సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాజేందర్‌. ప్రధాన కార్యదర్శి ఆర్‌.ప్రతాప్‌ నేతృత్వంలోని ప్రతినిధులు మంగళవారం మంత్రిని కలిశారు. ఆ తర్వాత సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, సీపీఎస్‌ ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయంతో సీఎం కేసీఆర్‌ పేరు చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం కొనియాడింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చంద్ర మోహన్‌, శ్రీనివా్‌సరెడ్డి ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-03-24T07:40:06+05:30 IST