‘నిధి’ తమ విభాగం దగ్గర ఉండాలని ముఖ్యమంత్రి చెప్పలేదు

ABN , First Publish Date - 2021-10-14T09:13:26+05:30 IST

సైనిక సంక్షేమ నిధి తమ విభాగం వద్ద ఉండాలని సీఎం కేసీఆర్‌ శాసనసభలో చెప్పలేదని సైనిక సంక్షేమ విభాగ డైరెక్టర్‌ కల్నల్‌..

‘నిధి’ తమ విభాగం దగ్గర ఉండాలని ముఖ్యమంత్రి చెప్పలేదు

  • సైనిక సంక్షేమ విభాగ డైరెక్టర్‌ రమేష్‌ వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సైనిక సంక్షేమ నిధి తమ విభాగం వద్ద ఉండాలని సీఎం కేసీఆర్‌ శాసనసభలో చెప్పలేదని సైనిక సంక్షేమ విభాగ డైరెక్టర్‌ కల్నల్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు. సైనికుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన చెప్పారు. ‘‘సైనిక సంక్షేమం ఉత్తుతి మాటేనా! రూ.30 కోట్ల సైనిక నిధి సీఎంఆర్‌ఎ్‌ఫకు బదిలీ’’ శీర్షికన ఈ నెల 7న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రమేష్‌ వివరణ ఇచ్చారు. ఉత్తర్వుల ప్రకారమే మాజీ సైనికులకు రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. సైనికుల సమస్యలను పరిష్కరిచేందుకు డీజీపీ నేతృత్వంలోని కమిటీ.. 2019 డిసెంబరులో చివరిసారిగా సమావేశమైందన్నారు. కరోనా నేపథ్యంలో ఆ తర్వాత భేటీ కుదరలేదని.. త్వరలోనే సమావేశమై మాజీ సైనికుల సమస్యలను కమిటీ పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-14T09:13:26+05:30 IST