కరోనాతో ఎంజీఎం ఫార్మాసిస్ట్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-19T04:07:10+05:30 IST

కరోనాతో ఎంజీఎం ఫార్మాసిస్ట్‌ మృతి

కరోనాతో ఎంజీఎం  ఫార్మాసిస్ట్‌ మృతి
గోపాల్‌ (ఫైల్‌)

హన్మకొండ అర్బన్‌, మే 18: వరంగల్‌ ఎంజీఎం గ్రేడ్‌ వన్‌ ఫార్మాసి్‌స్టగా విధులు నిర్వహిస్తున్న కౌంజుల గోపాల్‌ (51) కరోనాతో మృతి చెందాడు. కొం తకాలంగా కరోనాతో బాధపడు తూ ఆయన.. ఎంజీఎంలో చికి త్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన కుటుంబానికి ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌, తెలంగాణ రాష్ట్ర ఫార్మసిస్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిని సుదర్శన్‌గౌడ్‌, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్ట్‌ అసోసియేషన్ల ప్రతినిధులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గోపాల్‌ కుటుంబ సభ్యులకు సంతాపాని తెలిపిన వారిలో టీఎన్జీవో రాష్ట్ర నాయకులు కోలా రాజే్‌షగౌడ్‌, ఎంజీఎం వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది వంశీ, బస్వరాజు, కిరణ్‌, ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు.

యూనియన్‌ నాయకుడు..

కాళోజీ జంక్షన్‌, మే 18 : తెలంగాణ ఎన్‌ఎంఆర్‌ వర్క్‌చార్జెడ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా రోడ్లు భవనాల శాఖ ఉపాధ్యక్షుడు పిట్టల శ్రీధర్‌ (51) కరోనా బారినపడి మృతి చెందాడు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జీజుల వెంకటేశ్వర్లు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీధర్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీధర్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని యూనియన్‌ నాయకులు సదానందం, మధుసూదన్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-19T04:07:10+05:30 IST