6న మెగా ఉర్దూ జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2021-12-26T09:00:10+05:30 IST

ఉర్దూ మీడియం, ఉర్దూ సబ్జెక్టుతో ఉత్తీర్ణులైన యువత ఉపాధి కల్పనకు తెలంగాణలో మొదటిసారిగా మెగా ఉర్దూ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఉర్దూ అకాడమీ సంచాలకులు మహమ్మద్‌ గౌస్‌ తెలిపారు.

6న మెగా ఉర్దూ జాబ్‌ మేళా

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉర్దూ మీడియం, ఉర్దూ సబ్జెక్టుతో ఉత్తీర్ణులైన యువత ఉపాధి కల్పనకు తెలంగాణలో మొదటిసారిగా మెగా ఉర్దూ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఉర్దూ అకాడమీ సంచాలకులు మహమ్మద్‌ గౌస్‌ తెలిపారు. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, సెట్విన్‌, హైదరాబాద్‌ వీకర్‌ సెక్షన్‌ డెవల్‌పమెండ్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ సహకారంతో జనవరి 6న గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ప్రాంగణంలో జాబ్‌ మేళా కొనసాగుతుందని చెప్పారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, బ్యాంకులు, ఆస్పత్రులు, మరెన్నో ఇతర సంస్థలు జాబ్‌మేళాలో పాల్గొంటారన్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు డిసెంబరు 31లోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఇతర వివరాలు 040-23237810, 23008413, 35934083 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-12-26T09:00:10+05:30 IST