8న కొత్త మునిసిపాలిటీల సమావేశాలు?
ABN , First Publish Date - 2021-05-05T07:24:45+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్‌ల, మునిసిపాలిటీల పాలకవర్గాలు ఈ నెల 8న కొలువుదీరే అవకాశం ఉంది.

ఎన్నికల నిర్వహణపై నేడు కోర్టుకు ఎస్‌ఈసీ నివేదన
హైదరాబాద్, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్‌ల, మునిసిపాలిటీల పాలకవర్గాలు ఈ నెల 8న కొలువుదీరే అవకాశం ఉంది. ఏ కారణంగానైనా ఈ ఎన్నికలు వాయుదా పడినా సభ్యుల ప్రమాణ స్వీకారం రోజు నుంచే పదవీకాలం లెక్కలోకి వస్తుంది. మునిసిపల్ ఎన్నికల అంశం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. పోలింగ్ జరిగిన తీరుపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు కోరినట్లు సమాచారం. ఈ నెల 8న తొలి సమావేశాన్ని, మేయర్, చైర్మన్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్‌ల ఎన్నికలను కూడా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం కోర్టుకు చెప్పనున్నట్లు సమాచారం.