టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ
ABN , First Publish Date - 2021-07-24T23:21:24+05:30 IST
టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ

హైదరాబాద్: టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, మధుయాష్కీ, అంజన్, మహేష్ గౌడ్ హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, హుజూరాబాద్ ఉపఎన్నిక, ఉద్యోగాల భర్తీ కోసం 48 గంటల దీక్ష తదితర అంశాలపై చర్చించారు.