ఎంసెట్‌పై తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారుల కీలక భేటీ

ABN , First Publish Date - 2021-02-05T19:37:39+05:30 IST

హైదరాబాద్: ఎంసెట్‌పై తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారుల కీలక భేటీ జరిగింది. ఎస్‌సీఆర్‌టీ భవన్‌లో ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమీక్ష నిర్వహించారు.

ఎంసెట్‌పై తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారుల కీలక భేటీ

హైదరాబాద్: ఎంసెట్‌పై తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారుల కీలక భేటీ జరిగింది. ఎస్‌సీఆర్‌టీ భవన్‌లో ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమీక్ష నిర్వహించారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు 70 శాతం మాత్రమే సిలబస్ ఉంటుందన్నారు. ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు 100 శాతం సిలబస్ ఉంటుందని చిత్రా రామచంద్రన్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఎంసెట్ పరీక్ష 70 శాతం సిలబస్‌తోనే నిర్వహిస్తామన్నారు. ఎంసెట్‌లో వెయిటేజ్ మార్కులు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వెయిటేజ్ మార్కుల రద్దు లేదని చిత్రారామచంద్రన్‌ వెల్లడించారు. జూన్‌ 14 తర్వాత ఎంసెట్ నిర్వహణ ఉండే అవకాశం ఉందని తెలిపారు. 

Updated Date - 2021-02-05T19:37:39+05:30 IST