హుజూరాబాద్‌లో ఏం చేద్దాం?

ABN , First Publish Date - 2021-07-31T08:41:39+05:30 IST

పార్టీ కార్యక్రమాల పురోగతిపై వారం వారం సమీక్షించుకునేందుకు టీపీసీసీ ఏర్పాటు చేసుకున్న రాజకీయ వ్యవహారాల కమిటీ.. గాంధీభవన్‌లో శనివారం సమావేశంకానుంది.

హుజూరాబాద్‌లో ఏం చేద్దాం?

నేడు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పార్టీ కార్యక్రమాల పురోగతిపై వారం వారం సమీక్షించుకునేందుకు టీపీసీసీ ఏర్పాటు చేసుకున్న రాజకీయ వ్యవహారాల కమిటీ.. గాంధీభవన్‌లో శనివారం సమావేశంకానుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీల చైర్మన్లు, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలకు సంబంధించి, ఆగస్టు 9న ప్రారంభంకానున్న దళిత, గిరిజన దండోరా కార్యక్రమాలపైన ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. హుజూరాబాద్‌లో క్షేత్రస్థాయి నాయకత్వంతో సమావేశమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ.. క్షేత్రస్థాయి నివేదికను రూపొందించారు. ఆ నివేదికపైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమీక్ష జరపనుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్నారై, ఓ నేత పేర్లూ పరిశీలనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 9న దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-07-31T08:41:39+05:30 IST