మెడికల్ కాలేజ్ మంజూరు సంతోషంగా ఉంది: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-18T19:05:54+05:30 IST

సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పినట్టు సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

మెడికల్ కాలేజ్ మంజూరు సంతోషంగా ఉంది: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పినట్టు సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సంగారెడ్డిలో ఎంపీ కొత్త  ప్రభాకర్‌రెడ్డి , ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మనిక్ రావు , మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈసందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం జలాలతో జిల్లాను  సస్యశ్యామలం చేస్తున్నామని ఎంపీ కొత్త  ప్రభాకర్‌రెడ్డి  పేర్కొన్నారు.

Updated Date - 2021-05-18T19:05:54+05:30 IST