శామీర్‎పేట చెరువులో ఇద్దరు డాక్టర్లు గల్లంతు..

ABN , First Publish Date - 2021-06-21T15:14:15+05:30 IST

జిల్లాలోని శామీర్‎పేట చెరువులో ఇద్దరు డాక్టర్లు గల్లంతయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‎పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అల్వాల్‎లోని ఎక్సల్ హాస్పిటల్‎లో..

శామీర్‎పేట చెరువులో ఇద్దరు డాక్టర్లు గల్లంతు..

మేడ్చల్: జిల్లాలోని శామీర్‎పేట చెరువులో ఇద్దరు డాక్టర్లు గల్లంతయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‎పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అల్వాల్‎లోని ఎక్సల్ హాస్పిటల్‎లో అన్నదమ్ములు గౌతమ్ (27), నందన్ (24) డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్‎లో హోమియోపతి ఆస్పత్రి పెట్టి నగరంలో స్థిరపడ్డారు. అయితే.. ఆదివారం సరదాగా గడిపేందుకు ఇద్దరు అన్నదమ్ములు శామీర్‎పేట చెరువు వద్దకు వచ్చారు. చెరువు సమీపంలో సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో ఒకరు పడిపోయారు. వెంటనే సోదరుడిని కాపాడేందుకు మరో సోదరుడు వెళ్లగా ఇద్దరు చెరువులోనే ముగిపోయారు. ఈ క్రమంలో చెరువు లోతుగా ఉండటంతో..ఇద్దరికి ఈత రాకపోవడంతో చెరువులో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు వారణాసికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-06-21T15:14:15+05:30 IST