మేడారం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ రామ్మూర్తి మృతి

ABN , First Publish Date - 2021-07-12T05:38:54+05:30 IST

మేడారం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ రామ్మూర్తి మృతి

మేడారం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ రామ్మూర్తి మృతి
ఆలం రామ్మూర్తి (ఫైల్‌)

 మేడారం, జూలై 11: తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం విషాదం నెలకొంది. మేడారం జాతర ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి(53) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం ఛాతీలో నొప్పి రావడంతో స్థానికంగా వైద్యం చేసుకున్నారు. మళ్లీ  ఆది వారం ఉదయం నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ములుగుకు తరలిస్తుం డగా మార్గమధ్యలో మృతిచెందారు. ఏటూరునా గారం మండలం సింగారం గ్రామానికి చెందిన రామ్మూర్తి మేడారంలోని కాంతను మొదటి వివాహం చేసుకోగా ఒక కూతురు, ఇద్దరు కుమారులు జన్మించారు. మొదటి భార్య  సోదరి కుమారిని రెండో వివాహం చేసుకోగా ఒక కూతురు, ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో ఒక కుమారుడు ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి ఆయన మేడారం గ్రామంలోనే స్థిరపడ్డారు. 

జాతర నిర్వహణలో మూడుసార్లు..

 1998,2002 జాతరకు రామ్మూర్తి ట్రస్టుబోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2020లో తాత్కాలిక పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌గా జాతర నిర్వహణలో పాలుపంచుకున్నారు. మేడారం జాతర అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన, జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఆయన కృషి చేశారు. 1996 వరకు అభ్యుదయ యువజన సంఘం జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన ఆయన చంద్రబాబునాయుడు హయాంలో టీడీపీలో చేరారు. ఉత్తమ సేవలు కనబరిచిన ఆయనను గుర్తించి తాడ్వాయి మండల అధ్యక్షుడిగా నియమించారు. 1998, 2002లో మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2020లో రైతు సమన్వయ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2020లో మేడారం జాతర తాత్కాలిక పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్‌

 రామ్మూర్తి ఆకస్మిక మరణవార్త తెలుసుకున్న ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమవారం జరిగే అంత్యక్రియల్లో జిల్లాలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొనాలని సూచిం చారు. అదేవిధంగా జడ్పీవైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతి, జడ్పీటీసీలు తు మ్మల హరిబాబు, సకినాల భవాని, గై రుద్రమదేవితోపాటు పార్టీ నా యకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామ్మూర్తి మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరా థోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కలు సంతాపం ప్రకటించారు.  

Updated Date - 2021-07-12T05:38:54+05:30 IST