తేనేటీగల దాడిలో 50 మంది విద్యార్థులకు గాయాలు

ABN , First Publish Date - 2021-12-09T05:27:56+05:30 IST

తేనేటీగల దాడిలో 50 మంది విద్యార్థులకు గాయాలు

తేనేటీగల దాడిలో 50 మంది విద్యార్థులకు గాయాలు

పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది

గార్ల, డిసెంబరు 8 : గార్ల మండల కేంద్రంలోని నిర్మల హైస్కూల్లో భోజన విరామ సమయంలో ఆకతాయిలు తేనే తెట్టేపై రాళ్లు విసరడంతో ఆ పరిసరాల్లో భోజనం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై తేనే టీగలు దాడి చేసి 50 మందిని గాయపరిచాయి. దీంతో విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులు తీయగా తేనే టీగలు పెద్దఎత్తున వారిని వెంబడించి గాయపరిచాయి. గాయపడిన విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య చికిత్స నిమిత్తం వెళ్లగా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు నొప్పి భరించలేక రోదిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందే  తూతూ.. మంత్రంగా వైద్య సేవలందించి బయటకు పంపించారు. దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్య సేవలు పొంది ఉపశమనం పొందారు. దాడి జరిగిన పాఠశాల యాజమాన్యం కానీ, వైద్య సిబ్బంది కానీ పట్టించుకోకపోవడంతో స్థానికంగా పలు ఇబ్బందులకు గురయ్యా రు. ఆస్పత్రి సిబ్బందిపై జిల్లా అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-12-09T05:27:56+05:30 IST