యువత పెడదారి పట్టరాదు

ABN , First Publish Date - 2021-10-30T05:22:55+05:30 IST

యువత పెడదారి పట్టరాదు

యువత పెడదారి పట్టరాదు
వైద్య శిబిరంలో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

 ఎస్పీ కోటిరెడ్డి

గంగారం, అక్టోబరు 29 : ఏజన్సీ ప్రాంతంలో విద్యావంతులైన యువకులు పెడదారి పట్టరాదని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలో పోలీస్‌ అమర వీరుల వారోత్సవాల సందర్భంగా  శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగా సభలో ఆయన ప్రసంగించారు. ప్రకృతి అందాల నడుమ ను న్న కోమట్లగూడెం గ్రామంలో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారని తెలిపారు. వీరంతా ఉద్యోగాలు రాలేదని కలత చెందకుండా సంఘ విద్రోహులతో చేతులు కలపకుండా ఉండాలని కోరారు.  ఇక్కడ ఉన్న వారందరికి తాను పెద్ద కుమారుడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలకు ఏ కష్టం వచ్చిన తన ను కలిసి బాధలను చెప్పుకోవచ్చని అన్నారు. సుదూరు ప్రాంతాలకు చెందిన గిరిజనులకు వైద్య సేవలు చేయడం ఆనందంగా ఉందన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై ఉన్నారని, వారి సేవలను నిరంతరం పొందవచ్చని అన్నారు. అనంతరం వైద్య శిబిరంలో సేవలందించిన డాక్టర్లను ఆయన సత్కరించారు.

కానిస్టేబుల్‌ ఎంపిక కోసం ఉచితంగా శిక్షణ 

మండలంలో అర్హత కలిగిన గిరిజన యువతకు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యావంతులైన యువత వ్యసనాలకు బానిసకాకుండా వచ్చి దరఖాస్తు చేసుకుని శిక్షణ పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, గూడూరు సీఐ రాజిరెడ్డి, గంగారం ఎస్సై చంద్రమోహన్‌, జడ్పీటీసీ ఈసం రమా, ఎంపీపీ సువర్ణపాక సరోజన, వైస్‌ ఎంపీపీ ముడిగ వీరభద్ర, సర్పంచ్‌ గొగ్గిల సుగుణ తదితరులు పాల్గొన్నారు.

 వైద్య శిబిరానికి పోటెత్తిన రోగులు

పోలీస్‌ అమర వీరుల వారోత్సవాల సందర్భంగా కోమట్లగూడెం గ్రామంలో పో లీసులు నిర్వహించిన మోగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది.   30 మారుమూల గ్రామాల నుంచి 1500 మంది గిరిజనులు వైద్య సేవలకు రావడంతో శిబిరం రోగులతో కిటకిటలాడింది. మహబూబాబాద్‌, నర్సంపేట పట్టణా నికి చెందిన 13 మంది డాక్టర్లు వైద్య సేవలందించారు. రూ.50,000 విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా వైద్య సంఘం అధ్యక్షుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైద్య శిబిరం నిర్వహించారు. 

 

Updated Date - 2021-10-30T05:22:55+05:30 IST