దోమలతోనే వైరల్‌ ఫీవర్‌

ABN , First Publish Date - 2021-08-27T05:54:09+05:30 IST

దోమలతోనే వైరల్‌ ఫీవర్‌

దోమలతోనే వైరల్‌ ఫీవర్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు), ఆగస్టు 26 : దోమలతోనే డెంగీ, చికెన్‌ గున్యా, మలేరియా, ఫైలేరియా, విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. ఊరూరా వాటి నివారణకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని గుర్తు చేశారు. గురువారం మరిపెడ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గుగులోత్‌ అరుణ అధ్యక్షతన జరుగగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వైద్యఆరోగ్యం, వ్యవసాయం, మిషన్‌భగీరథ, విద్యాశాఖలపై సమీక్ష చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. హెల్త్‌ సబ్‌ సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్‌ పక్రియను వేగవంతం చేయాలని పీహెచ్‌సీ డాక్టర్‌ పృథ్వీకి సూచించారు. మండల వ్యాప్తంగా 80వేల జనాభా ఉంటే ఇప్పటి వరకు మొత్తం 16వేల మందికి టీకాలు వేశారని, అందులో 5వేల మందికి సెకండ్‌ డోస్‌ వేయడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కరోనా మూడో వేవ్‌ నుంచి రక్షణ పొందడానికి ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలన్నారు. అదేవిధంగా సెప్టెంబర్‌ 1నుంచి స్కూల్స్‌ ఓపెన్‌ అవుతున్నందున శానిటేషన్‌, తరగతి గదుల శుభ్రత, ఇతరాత్ర వసతులను విద్యార్థులకు కలిపించే బాధ్యత సర్పంచ్‌లదేనని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీ తేజవత్‌ శారద, తహసీల్దార్‌ రమేశ్‌బాబు, వైస్‌ ఎంపీపీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-27T05:54:09+05:30 IST