ఉద్యమగడ్డ మానుకోట రుణం తీర్చుకుంటా..

ABN , First Publish Date - 2021-11-27T05:01:22+05:30 IST

ఉద్యమగడ్డ మానుకోట రుణం తీర్చుకుంటా..

ఉద్యమగడ్డ మానుకోట రుణం తీర్చుకుంటా..
ఎమ్మెల్సీ రవీందర్‌రావును గజమాలతో సన్మానిస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

గులాబీ కండువా కప్పుకున్న కార్యకర్తలను కాపాడుకుంటాం

కలిసి పని చేస్తాం.. జిల్లాను అభివృద్ధిలో పథంలో నిలుపుదాం

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు

మహబూబాబాద్‌ టౌన్‌, నవంబరు 26: ఉద్యమగడ్డ, సొంత జిల్లా మానుకోట రుణం తీర్చుకుంటానని శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తొలిసారిగా శుక్రవారం మహబూబాబాద్‌కు వచ్చారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, స్నేహితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మూడు కొట్ల సెంటర్‌ నుంచి విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన అభినందన సభలో శాలువాలతో సత్కరించి రవీందర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్‌రావు మాట్లాడుతూ 30 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటున్నానని చెప్పారు. క్రమశిక్షణ, విధేయతతో పని చేసిన తనకు సీఎం కేసీఆర్‌ పెద్ద అవకాశం ఇచ్చారని, తాను ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గులాబీ కండువా కప్పుకున్నా ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కష్టాల్లో తన వెంట ఉన్న వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, నాయకులు మంగలం పల్లి కన్న, జెరిపోతుల వెంకన్న, బానోత్‌ రవికుమార్‌, మూల మధుకర్‌రెడ్డి, మర్రి నారాయణరావు, సత్యనారాయణ, బట్టు శ్రీను, మాదరబోయిన యాకయ్య, బాషికాల అంబరీష, మడత వెంకన్న, పుచ్చకాయల రామకృష్ణ, బద్రినారాయణ, కుర్మ మురళీ, సుధాకర్‌, ముత్యం వెంకన్న, మహబూబ్‌ ఫాష, గోగుల మల్లయ్య, శ్రీనివాస్‌, లక్ష్మయ్య పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..

 జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ అందరం కలిసి కట్టుగా పని చేసి జిల్లా అభివృద్ధి కోసం పాటు పాడుతామని చెప్పా రు. ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ గ్రూపులు కట్టకుండా నిబద్దతతో పని చేద్దామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌, మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివా్‌సరెడ్డి, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, గద్దె రవి, గోగుల రాజు, సుధగాని మురళి, నాయిని రంజిత్‌, మాదారపు సత్యనారాయణ, మర్రి నారాయణరావు, ఎంపీపీలు మౌనిక, ఎర్రబెల్లి మాధవి, బానోత్‌ సుజాత, జడ్పీటీసీలు మేక పోతుల శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనాధ్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-27T05:01:22+05:30 IST