పేదల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-07T05:47:18+05:30 IST

పేదల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

పేదల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

 మానుకోట ఎమ్మెలే శంకర్‌నాయక్‌ 

మహబూబాబాద్‌ టౌన్‌, అక్టోబరు 6 : నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ పరిధిలోని కేసముద్రం, నెల్లికుదురు, మానుకోట, గూడూరు మండలాలకు చెందిన 40 మందికి రూ. 14,28,500ల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ. రాష్ట్రంలో పేదలను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పర్కాల శ్రీనివా్‌సరెడ్డి, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు గద్దె రవి, కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్‌, జడ్పీటీసీ రావుల శ్రీనాధ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాయిని రంజిత్‌, గోగుల రాజు, పార్టీ మండల అధ్యక్షులు పరిపాటి వెంకట్‌రెడ్డి, ఎమ్డీ.నజీర్‌, వెంకటకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రమేష్‌, లూనావత్‌ అశోక్‌, నూకల సురేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

మోడల్‌ మార్కెట్‌ పనుల పరిశీలన..

మహబూబాబాద్‌ పట్టణంలో నిర్మిస్తున్న మోడల్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను స్ధానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  అనంతరం మెడికల్‌ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని సందర్శించి నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించారు. మెడికల్‌ కళాశాల మానుకోట జిల్లాకు తలమానికంగా నిలవబోతుందన్నారు. సాయంత్రం జిల్లా ఆస్పత్రిలోని అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎండీ.ఫరీద్‌, గద్దె రవి, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్దన్‌, గుండా రాజశేఖర్‌, మునీర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ తానేశ్వర్‌, డీఈ రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-07T05:47:18+05:30 IST