ప్రతీ గ్రామంలో పార్టీ కార్యాలయం ఉండాలి
ABN , First Publish Date - 2021-10-29T05:17:24+05:30 IST
ప్రతీ గ్రామంలో పార్టీ కార్యాలయం ఉండాలి

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు రూరల్, అక్టోబరు 28 : ప్రతీ గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. తొర్రూరు మండలం వెల్లిక ట్టె గ్రామశివారులోని గురువారం ఓ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసి న పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర, రా యపర్తి మండలాల కార్యకర్తలతో తొర్రూరు మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడారు. కార్యకర్తలు ఎవ్వరు అదైర్యపడవద్దని, ఏ ఒక్క కార్యకర్తలకు కష్టం వచ్చిన కమిటీలు, కార్యకర్తలు అండగా ఉంటూ కుటుంబంలా ఆదుకోవాలన్నారు. త ర్వలో వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు భారీ సం ఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాల కోసం స్థల సేకరణ చేయాలని సూచించారు. మండల, గ్రామస్థాయి కమిటీలు ప్రతినెల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. సమావేశాలు నిర్వహించని కమిటీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంద ని హెచ్చరించారు. తొలుత పట్టణ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నాంచారిమడూరు నుంచి సమావేశ ప్రాంగణంలో వరకు బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు. ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజ య్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మునిసిపల్ చైర్మన్ రా మచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, రైతుసమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇట్టె శ్యాంసుందర్‌రెడ్డి, మురళి, మెండీస్, మాలిక్, మూడు మండలాల మండల, పట్టణ, వివిధ అనుబంధ కమిటీల నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.