ఉద్యోగుల విభజన ప్రక్రియతో ఖాళీలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2021-12-25T06:21:33+05:30 IST

ఉద్యోగుల విభజన ప్రక్రియతో ఖాళీలను భర్తీ చేయాలి

ఉద్యోగుల విభజన ప్రక్రియతో ఖాళీలను భర్తీ చేయాలి

కలెక్టర్‌ శశాంక

మహబూబాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) :ఉద్యోగుల విభజన ప్రక్రియతో జిల్లాలోని ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను తప్పనిసరిగా భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగుల విభజన, బదిలీలు, చేరికలపై జిల్లా అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఉద్యోగుల విభజన అనంతరం చేపట్టిన బదిలీలు, చేరికలపై  ఖాళీలను భర్తీ చేయాలన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగుల వివరాలను ఆయా శాఖల నోటీస్‌ బోర్డులపై ఉంచుతూ... కలెక్టర్‌ కార్యాలయంలోని నోటీ్‌సబోర్డుపై కూడ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులు సీనియర్టీ ప్రకారంగానే విభజన చేయడం జరిగిందని, ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల సినియార్టీ ప్రకారం.. స్థానాలను సూచిస్తూ నివేదికలు అందించాలన్నారు. ఉద్యోగుల కేటాయింపుకు పేర్లు, హోదాలతో నివేదిక రూపొందించాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట సిబ్బంది కేటాయింపు కూడ ఎక్కువగానే చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు అభిలాషఅభినవ్‌, కొమురయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T06:21:33+05:30 IST