రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి

ABN , First Publish Date - 2021-11-27T05:03:41+05:30 IST

రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి

రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి
కలెక్టర్‌ కార్యాలయలో ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ శశాంక, ఎస్పీ కోటిరెడ్డి

కలెక్టర్‌ శశాంక

మహబూబాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. మహబూబాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవ సంవిధాన్‌ దివా్‌సను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శశాంక మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆజాద్‌ అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని, ఇందులో భాగంగా భారత రాజ్యాంగ దినోత్సవా న్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగానికి అందరు సమానమని, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ప్రతీ ఒక్కరివని చెప్పారు. ఇదే రోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా కావడం గర్వించదగిన విషయమన్నారు. అనంతరం రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్‌, కొమరయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలి..

ఆర్టీసీ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రణాళిక బద్దంగా కృషి చేయాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్టీసీ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధి త అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఆర్టీసీ ఆర్‌ఎం విజయభాస్కర్‌, డిపో మేనేజర్లు రాజ్యలక్ష్మి, రమేష్‌, కమిషనర్‌ ప్రసన్నారాణి పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-27T05:03:41+05:30 IST