నీటి నిల్వలను తక్షణమే తొలగించాలి

ABN , First Publish Date - 2021-08-27T05:52:30+05:30 IST

నీటి నిల్వలను తక్షణమే తొలగించాలి

నీటి నిల్వలను తక్షణమే తొలగించాలి
నీటి నిల్వ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

మహబూబాబాద్‌ , ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : తక్షణమే నీటి నిల్వలను తొలగించి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఆదేశించారు. మహబూబాబాద్‌లో అవెన్యూప్లాంటేషన్‌, శానిటేషన్‌ను పరిశీలించారు. తొలుత జిల్లా పోలీస్‌ కార్యాలయం వద్ద అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించి రోడ్డుకు ప్లాంటేషన్‌కు మధ్య ఉన్న చెత్త ను తొలగించాలని సూచించారు. అనంతరం నర్సంపేట రోడ్‌లోని ఆర్టీసీ కాలనీ వద్ద లోతట్టు ప్రాంతం లో నిలిచి ఉన్న నీరును తొలగింపజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయత్రి గుట్ట వద్ద ఖాళీ ప్రదేశంలో పెరిగిన చెత్తను తొలగించి క్రీడా స్థలాలు గా వినియోగించుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసన్నారాణిని ఆదేశించారు. గుమ్ముడూర్‌ హరిజనవాడలో రోడ్డుపై నిలిచిన నీటిని పరిశీలించి ఇలాంటి ప్రాంతాలను గుర్తించి పరిశుభ్రపర్చాలన్నారు. గు మ్మూడూరులో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లని ర్మాణాలను పరిశీలించారు. ఇళ్లను నాణ్యతతో నిర్మించి త్వరితగతిన పూర్తి చే యాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ తానేశ్వర్‌, డీఈలు రాజేందర్‌, ఉపేందర్‌ పాల్గొన్నారు. 

వైద్యసేవలు విస్తృత పర్చాలి..

సీజనల్‌ వ్యాధులను నియంత్రించేందుకు మారుమూల, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తృతపర్చాలని  కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌ ఆదేశించారు.  కలెక్టర్‌ కార్యాలయం నుంచి సీజనల్‌ వ్యాధులు, కొవిడ్‌-19పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... నీటి నిల్వ ఉండే ప్రాంతాల్లో గంబూషియా చేపపిల్లలను వదిలిపెట్టాలని, మురికి నీటి ప్రాంతాల్లో అయిల్‌బాల్స్‌ వేయించాలన్నారు. ఫ్రైడే డ్రైడేను విస్తృతంగా చేపట్టి పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని డీపీవోను ఆదేశించారు. కురవి, గార్ల, డోర్నకల్‌ మండలాల్లో అన్ని పంచాయతీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గూడూరు సీహెచ్‌సీలో డెంగీ వైద్యసేవల నిమిత్తం ఐదు బెడ్లతో విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ టీకా కోసం సబ్‌సెంటర్లు, రైతు వేదికలను వినియోగించుకోవాలన్నారు. అధికారులు రమాదేవి, హరీ్‌షరాజ్‌, సుధీర్‌రెడ్డి, అంబరీష, విక్రమ్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-27T05:52:30+05:30 IST