పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-07-24T05:53:45+05:30 IST
పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయాలి

కలెక్టర్ అభిలాషఅభినవ్
మహబూబాబాద్ టౌన్, జూలై 23 : మునిసిపాలిటీల అభివృద్ధికి చర్యలు తీసు కుంటూ పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ అభి లాషఅభినవ్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, మానుకోట పట్టణాల్లోని అభివృద్ధి పనులపై మునిసిపల్ చైర్మన్లు, కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధా నంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పారిశుధ్య కార్మికు లు సకాలంలో విధులకు రాకపోతే సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసు కుంటామన్నారు. నిరంతరం చెత్తసేకరణ జరగాలని, డ్రెయినేజీలు శుభ్రం చేయిం చాలన్నారు. వర్షాకాలంలో ప్రధాన రహదారులపై పారిశుధ్య పనులు చేపడుతున్నా రని, వార్డుల్లో చేపట్టడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అపరిశు భ్రంగా ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ఆదేశించారు.
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి..
మహబూబాబాద్, డోర్నకల్‌లో ఇంటిగ్రెటెడ్ మోడల్ మార్కెట్ పనులను వేగవం తం చేసి నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అభిలాషఅభినవ్ సూచించారు. హరితహారంలో భాగంగా హోమ్‌స్టీడ్ ప్లాంటేషన్ వేగవంతం చేయాలన్నారు. లే అవుట్ ప్రదేశాలపై దృష్టి పెట్టి గ్రీనరిని అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశా ల భవనాల్లో కొవిడ్ వ్యక్తులకు వసతులు కల్పించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యం లో వాగులు, వంకలు పొంగి లోతట్టు ప్రదేశాల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలన్నారు. ప్రమాద ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సహాయక కలెక్టర్ అభిషేక్ అగస్త్య, కార్యాలయ పర్యవేక్షకులు రమేష్ పాల్గొన్నారు.