కరోనాతో తల్లీకూతుళ్ల మృతి

ABN , First Publish Date - 2021-05-30T06:23:59+05:30 IST

కరోనాతో తల్లీకూతుళ్ల మృతి

కరోనాతో తల్లీకూతుళ్ల మృతి

కూతురు చనిపోయిన మూడో రోజున తల్లి..

కన్నీటి పర్యంతమైన కుమారులు

బయ్యారం, మే 29: మూడు రోజు ల వ్యవధిలో కరోనాతో తల్లీకూతుళ్లు చనిపోయిన విషాద ఘటన  బయ్యా రం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బయ్యారం మండ లం ఇర్సులాపురం గ్రామానికి చెందిన కత్తి సత్తెమ్మకు(75) వారం రోజుల క్రి తం కరోనా సోకింది. కొద్ది రోజులు హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న సత్తెమ్మకు పల్స్‌ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో చేర్పించారు. అయితే అక్కడ చిక్సిత పొందుతున్నప్పటికీ పల్స్‌ మరింత పడి పోయి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు శుక్రవారం సా యంత్రం సత్తెమ్మను ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం శనివారం తెల్లవారు జాము న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా, ఇదే జిల్లా కేసుముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సతెమ్మ పెద్ద కూతరు హైమావతి (58) కూడా కరోనాతో ఈనెల 27న ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందింది. మూడు రోజుల వ్యవధిలోనే తల్లి, అక్క మృత్యువాత పడటంతో సత్తెమ్మ కుమారులు అశోక్‌, కిషోర్‌లు శోకసంద్రంలో మునిగిపోయారు. సత్తెమ్మ ఇంటా విషాదచాయలు అలుముకున్నాయి.   

Updated Date - 2021-05-30T06:23:59+05:30 IST