లీకేజీలపై మేయర్‌ ఫైర్‌

ABN , First Publish Date - 2021-10-21T05:28:40+05:30 IST

లీకేజీలపై మేయర్‌ ఫైర్‌

లీకేజీలపై మేయర్‌ ఫైర్‌
పనులు పరిశీలిస్తున్న మేయర్‌ సుధారాణి, కమిషనర్‌ ప్రావీణ్య

 ఇంజినీర్లకు క్లాస్‌.. 

చర్యలు తప్పవని హెచ్చరిక

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), అక్టోబరు 20: నగరంలో లీకేజీలు అరికట్టాలని చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారం టూ బల్దియా ఇంజినీర్లపై మేయర్‌ గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మారకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా మిషన్‌ భగీరథ పనులు సంపూర్ణంగా లేకపోవడంతో మేయర్‌ అధికారులపై మండిపడ్డారు. బుధవారం కమిషనర్‌ ప్రావీణ్యతో కలిసి పోతననగర్‌, కాశిబుగ్గ, హెడ్‌పోస్టాఫీసర్‌ సెంటర్‌, రంగశాయిపేట, శివనగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులో కూల్చివేసిన మున్సిపిపల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్‌ జంక్షన్‌ వద్ద జంక్షన్‌ నిర్మాణ అంశాలను చర్చించారు. నగరంలో పారిశుధ్యం మరింత మెరుగవ్వాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్యం అధికారులను ఆదేశించారు. 

సురక్ష ఛాలెంజ్‌కు సిద్ధం కండి..

క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా బృందం నగరంలో పర్యటించనున్న క్రమంలో సఫాయి మిత్ర సురక్ష ఛా లెంజ్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ సిద్ధం చేయాల ని సీఎంహెచ్‌వో రాజారెడ్డిని మేయర్‌ ఆదేశించారు. బుధవారం బల్దియాలో సమీక్ష జరిపారు. నగరంలోని 46 పబ్లిక్‌ టాయిలెట్లను యుద్ధప్రాతిపదికన శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టిక్‌ ట్యాంక్‌ ఆపరేటర్లు, ఆస్కి, శానిటేషన్‌ సిబ్బందికి సఫాయి మిత్ర ఛాలెంజ్‌కు సంబంధంచిన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. ప్రతీ మూడేళ్లకోసారి సెప్టిక్‌ట్యాంక్‌ క్లినింగ్‌ జరిగేలా నగర వాసులు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌ 14420ను విస్తృతంగా తెలియచేయాలన్నారు. 

స్మార్ట్‌ పనులు త్వరగా పూర్తి చేయండి

నగరంలో స్మార్ట్‌ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన రహదారులు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ లైటింగ్‌ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 

Updated Date - 2021-10-21T05:28:40+05:30 IST