వైభవంగా గోదాదేవి రంగనాథస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T04:05:42+05:30 IST

వైభవంగా గోదాదేవి రంగనాథస్వామి కల్యాణం

వైభవంగా గోదాదేవి రంగనాథస్వామి కల్యాణం
కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

నర్సింహులపేట, జనవరి 13: మండల కేంద్రంలో ని వెంకటేశ్వర దేవస్థానం ఆవరణలో గోదాదేవి, రం గనాథస్వామి కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. అర్చకులు నందనాచార్యులు, రామాచార్యు లు, నర్సింహాచార్యుల పర్యవేక్షణలో అర్చక బృందం గణపతి పూజ, తొలక్కం, బిందేతీర్ధంతో పాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో వంశీ, సర్పంచ్‌ వేముల రజిత రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నెల్లికుదురు : మండలంలోని మధనతుర్తి గ్రామం లో కొందడరామచంద్రస్వామి ఆలయంలో భోగి సం క్రాంతి పర్వదినం పురస్కరించుకొని గోదాదేవి రంగనాథస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ వలభోజు వెంకటేశ్వర్లు, రాజసులోచన దంపతుల సమక్షంలో వేదపండితులు ప్రతాపురం నర్సింహచార్యులు, కాటూరి, రామచంద్రాచార్యులు వేదమంత్రాలతో కల్యాణం, పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ కొమ్ము అనిల్‌, మాజీ ఎంపీటీసీ మంగి మల్లయ్య, ఎర్రంశెట్టి సీతారాములు, బియ్యాల నలినిదేవి సోమేశ్వర్‌రావు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

పెద్దవంగర : మండలంలోని చిట్యాల గ్రామంలోని సీతారామాలయంలో గోదారంగనాథుల వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధా న అర్చకులు మోటుపల్లి శేషాచార్యలు గోదా రంగనాథులస్వామి వారి కల్యాణోత్సవం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రావుల శ్రీనివా్‌సరెడ్డి, రావుల శ్యామ్‌ సుందర్‌రెడ్డి, కొల్లూరి అశోక్‌, బోనాగిరి వేణుమాదవ్‌, చెరుకు శ్రీధర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

తొర్రూరురూరల్‌ : తొర్రూరు మండలం హరిపిరా ల గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో గోదారంఘనాథుల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయ అర్చకులు శ్రీకాంత్‌, ముఖేష్‌ సం ప్రదాయంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రావుల మమత జగదీ్‌షచందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ గోపమ్మమల్లయ్య, పంచాయతీ కార్యదర్శి దేవయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T04:05:42+05:30 IST